Karnataka: కర్ణాటక పరిస్థితిని చూసిన తర్వాత కూడా హైకోర్టును తరలించగలం అనుకుంటున్నారా?: వర్ల రామయ్య

  • సీఎం జగన్ కు జీఎన్ రావు కమిటీ నివేదిక సమర్పణ
  • ట్విట్టర్ లో స్పందించిన వర్ల రామయ్య
  • హైకోర్టు తరలింపు అంత తేలిక కాదని హితవు

జీఎన్ రావు కమిటీ సీఎం జగన్ కు నివేదిక సమర్పించడం తదితర పరిణామాలపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. 'సీఎం గారూ, మీ కమిటీ మీరు చెప్పిందే రాస్తుంది, ఆ కమిటీ రాసిన రాతలకు ప్రభుత్వం రాక్షసానందం పొందుతోంది' అంటూ ట్వీట్ చేశారు. హైకోర్టును తరలించాలనుకోవడం ఎంతో ప్రయాసతో కూడుకున్న పని అని, అంత తేలిక కాదని హితవు పలికారు. రాష్ట్రపతి అనుమతి, సుప్రీంకోర్టు ఆమోదం ఇట్లాంటి ఎన్నో విషయాలతో ముడిపడి ఉంటుందని తెలిపారు. 'కర్ణాటకలో హుబ్లీలో హైకోర్టు బెంచ్ కావాలని ఎంతోకాలం నుంచి అడుగుతున్నా సుప్రీంకోర్టు అంగీకరించట్లేదు, మీరే విధంగా తరలించగలమనుకుంటున్నారు?' అంటూ ప్రశ్నించారు.

Karnataka
Andhra Pradesh
YSRCP
Jagan
High Court
Varla Ramaiah
Telugudesam
  • Loading...

More Telugu News