australiyan shepard dog: కుక్క ఆచూకీ కనుక్కోండి...రూ.5 లక్షలు బహుమతిగా అందుకోండి!

  • అమెరికాలోని ఓ మహిళ ఆఫర్‌
  • కిరాణా దుకాణం నుంచి వస్తుండగా తప్పిపోయిన పెంపుడు కుక్క
  • దాన్ని వెతికేందుకు ఏకంగా అద్దెకు విమానం

డబ్బున్న వారి చమక్కులంటే ఇలాగే ఉంటాయి మరి. పెంపుడు కుక్క తప్పిపోయిందని ఏకంగా అద్దెకు విమానం తీసుకుని వెతుకుతోంది ఓ మహిళ. అంతేకాదండోయ్‌ తన కుక్క ఆచూకీ చెప్పిన వారికి ఐదు లక్షల బహుమతి కూడా ఇస్తానని ప్రకటించింది ఈ మహిళ. వివరాల్లోకి వెళితే...శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఎమిలీ టాలెర్మో ఆస్ట్రేలియన్ షెఫర్డ్ డాగ్‌ను పెంచుతోంది. దానికి ముద్దుగా జాక్సన్‌ అని పేరు పెట్టుకుంది. గత వారం కిరాణ దుకాణానికి వెళ్లిన ఎమిలీ టాలెర్మో తనతోపాటు జాక్సన్ ను కూడా తీసుకు వెళ్లింది. తిరిగి వస్తున్నప్పుడు  కుక్క తప్పిపోయింది.

అప్పటి నుంచి ఎమిలీ తన స్నేహితులతో కలిసి కుక్కను వెతికినా ప్రయోజనం లేకపోయింది. తన కుక్కని  కావాలనే ఎవరో అపహరించి ఉంటారని భావించిన ఎమిలీ టాలెర్మో దాన్ని వెతికి ఇచ్చిన వారికి రూ. 5 లక్షల నజరానాను ప్రకటించింది. అంతేకాక కుక్కను వెతకడానికి సహాయంగా ఓ విమానాన్ని సైతం అద్దెకు తీసుకుంది.

విమాన ఖర్చులకు అదనంగా 1200 డాలర్లను కేటాయించింది. ఈ సందర్భంగ్  ఎమిలీ మాట్లాడుతూ తన అయిదేళ్ల జాక్సన్‌ను వెతకడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నానని, అందుకు వీలైనవారు సహాయం చేయాలని కోరింది.

australiyan shepard dog
missing
America
  • Loading...

More Telugu News