CM Jagan: ఆయురారోగ్యాలతో చిరకాలం వర్థిల్లండి: జగన్ కు మోదీ శుభాకాంక్షలు

  • ట్విట్టర్‌లో సందేశాన్ని పంపిన ప్రధాని 
  • అభినందనలు తెలియజేసిన నితిన్ గడ్కరీ 
  • సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుతున్నా

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు తన పుట్టిన రోజు వేడుకలను సీఎం జరుపుకుంటున్న సందర్భంగా మోదీ ట్విట్టర్ వేదికగా తన సందేశాన్ని పంపారు. 'మీరు చిరకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి' అంటూ మోదీ తన అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి కూడా ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. 'మీరు కలకాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు.

CM Jagan
PM MOdi
birthday wishes
gadkari
  • Loading...

More Telugu News