avanti srinivas: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీకి 3 రాజధానులు వస్తున్నాయి: మంత్రి అవంతి

  • టీడీపీ హయాంలో ఐదేళ్లలో జరగని అభివృద్ధి ఐదు నెలల్లో జగన్ చేశారు
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేయాలి
  • వైసీపీ కార్యకర్తలు కృషి చేయాలి

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు వస్తున్నాయని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో జరగని అభివృద్ధిని ఐదు నెలల్లో సీఎం జగన్ చేశారని ఆయన అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖపట్నం వైసీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు కావడంతో అమరావతిలో ఆయనను పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు అమరావతిలో రైతులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే.

avanti srinivas
Andhra Pradesh
YSRCP
  • Loading...

More Telugu News