Hyderabad: వ్యభిచారం చేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 3 వేల ఫోన్ కాల్స్!

  • హైదరాబాద్, మియాపూర్‌లో ఘటన
  • వాట్సాప్‌లో అభ్యంతరకర వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తున్న నిందితులు
  • తన సోదరికి అభ్యంతరకర కాల్స్ వస్తున్నాయంటూ మరో వ్యక్తి ఫిర్యాదు

వ్యభిచారం చేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తన భార్యకు 3 వేల ఫోన్ కాల్స్ వచ్చాయంటూ ఓ భర్త హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ నెల 15న రెండు వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్ చేసిన మహిళలు వ్యభిచారం చేయాల్సిందిగా తన భార్యపై ఒత్తిడి తీసుకొచ్చారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలి భర్త పేర్కొన్నాడు. వాట్సాప్‌లో అభ్యంతరకర వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

కాగా, మియాపూర్ ప్రాంతంలో ఇటువంటి బాధితులు చాలామందే ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఓ వ్యక్తి తన సోదరికి వస్తున్న కాల్స్‌పై పోలీసులను ఆశ్రయించాడు. గుర్తు తెలియని వ్యక్తులు తరచూ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, అభ్యంతరకర వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మరీ అందులో వీడియోలు షేర్ చేస్తున్నట్టు తెలిపాడు. ఈ రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News