Rajinikanth: దేశవ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లపై రజనీకాంత్ ఆవేదన.. ట్రెండింగ్‌లో సూపర్ స్టార్ వ్యాఖ్యలు
![](https://imgd.ap7am.com/thumbnail/tn-544e53ae8fc0.jpg)
- సమస్యకు హింస, అల్లర్లు పరిష్కారం కావంటూ రజనీ ట్వీట్
- రజనీ వ్యాఖ్యలకు మిశ్రమ స్పందన
- రజనీ మద్దతుదారులు, వ్యతిరేకులుగా విడిపోయిన సోషల్ మీడియా
కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ట్రెండ్ అవుతున్నాయి. ఆందోళనలు, హింసాత్మక ఘటనలపై రజనీ స్పందిస్తూ.. ఇవి తనను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నాడు. ఏ సమస్యకూ అల్లర్లు, హింస పరిష్కారం కాకూడదని అభిప్రాయపడుతూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లో ఉంది.
రజనీ ట్వీట్‌కు మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఆయన అభిప్రాయాన్ని తప్పుబడుతుంటే, మరికొందరు మద్దతు పలుకుతున్నారు. ‘ఐ స్టాండ్ విత్ రజనీకాంత్’ హ్యాష్‌ట్యాగ్‌తో రజనీ మద్దతుదారులు, ‘షేమ్ ఆన్ యు సంగి రజని’ హ్యాష్‌ట్యాగ్‌తో వ్యతిరేకులు కామెంట్ చేస్తున్నారు. అయితే, రజనీ మద్దతుదారుల హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో అగ్రస్థానంలో ట్రెండ్ అవుతోంది.