Ration card: జూన్ నుంచి రేషన్ కార్డును దేశంలో ఎక్కడైనా వాడుకోవచ్చు: కేంద్రం
- వలస జీవులకు శుభవార్త
- జూన్ నుంచి ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’ పథకం
- కొత్తకార్డులపై ప్రచారాన్ని కొట్టిపడేసిన కేంద్రం
పొట్టచేతపట్టుకుని దేశంలోని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది జూన్ 1 నుంచి రేషన్ కార్డును దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. జూన్ నుంచి ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’ పథకం ప్రారంభమవుతుందన్నారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మార్పించుకుంటే కొత్త కార్డులు ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్న మంత్రి.. రాష్ట్రం మారితే కొత్త కార్డు అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుతో దేశంలోని ఏ ప్రాంతంలోనైనా సరుకులు తీసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు.