CAA: పౌరసత్వ చట్టంపై ప్రభుత్వం స్పందన.. భారతీయులుగా గుర్తింపబడేదెవరో చెప్పిన కేంద్రం!

  • పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు
  • 1 జులై 1987 ముందు దేశంలో జన్మించిన వారంతా భారతీయులే
  • తల్లిదండ్రుల్లో ఒకరు భారత్‌లో జన్మించితే పౌరసత్వం

పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్న వేళ కేంద్రం స్పందించింది. ఈ చట్టంపై వివరణ ఇచ్చి ప్రజల్లోని అపోహలను తగ్గించే ప్రయత్నం చేసింది. భారత పౌరసత్వం ఎవరికి లభిస్తుందో తెలిపింది.

1 జులై 1987కు ముందు దేశంలో జన్మించిన వారితోపాటు, ఎవరి తల్లిదండ్రులైనా ఆ తేదీకి ముందు దేశంలో జన్మించి ఉంటే వారికి పౌరసత్వం లభిస్తుందని, వారంతా భారతీయులుగా గుర్తింపబడతారని స్పష్టం చేసింది. అలాగే, 2004 పౌరసత్వ చట్టం ప్రకారం దేశంలోని ఎవరి తల్లిదండ్రులైనా ఒకరు భారతీయులు అయి ఉండి, మరొకరు శరణార్థి అయినప్పటికీ వారు భారతీయులే అవుతారని వివరించింది. అయితే, ఇది అసోంలోని వారికి మాత్రం వర్తించదని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News