GN Rao Committee: కమిటీ నివేదికతో ఆనందంగా ఉందన్న బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

  • సీఎంకు నివేదిక సమర్పించిన జీఎన్ రావు కమిటీ
  • రాజధానిపై అధ్యయనం కోసం ఏర్పాటైన కమిటీ
  • నివేదికలోని సిఫారసులపై భిన్న అభిప్రాయాలు

ఏపీ రాజధానిపై అధ్యయనం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నియమించిన జీఎన్ రావు కమిటీ తమ తుది నివేదికను సీఎం జగన్ కు సమర్పించింది. ఈ కమిటీ నివేదికపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. కమిటీ నివేదిక తమకు ఎంతో ఆనందాన్ని కలిగించినట్టు తెలిపారు. విశాఖలో సచివాలయం, హైకోర్టు డివిజన్ బెంచ్ ఏర్పాటు ప్రకటనను స్వాగతిస్తున్నామని అన్నారు. జీఎన్ రావు కమిటీ సిఫారసులతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు.

GN Rao Committee
Andhra Pradesh
Amaravathi
YSRCP
Jagan
Vishnu Kumar Raju
BJP
  • Loading...

More Telugu News