Bhagavatha Saptaham at NTR Gardens: చాగంటి కోటేశ్వరరావు మానవ జాతికి దొరికిన మణిపూస: సీఎం కేసీఆర్
- భాగవత సప్తాహం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్
- చాగంటివారిని గౌరవిస్తే.. మనల్ని మనం గౌరవించుకున్నట్లే..
- ఎక్కడికి వెళ్లినా రాని క్రమశిక్షణ గుడికి వెళితే వస్తుంది
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మైదానంలో, ప్రసిద్ధ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగిన భాగవత సప్తాహం ఈ రోజు ముగిసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చాంగటివారిని శాలువాతో సన్మానంచేసి, జ్థాపికను అందచేశారు.
అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తూ.. చాగంటి మానవ జాతికి దొరికిన మణిపూసని అభివర్ణించారు. భగవంతుని గురించి చదివినా.. విన్నా పుణ్యం లభిస్తుందన్నారు. కోటేశ్వరరావును సన్మానించినడం గొప్పగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. చాగంటివారిని గౌరవిస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్లేనని పేర్కొన్నారు. ఎక్కడికెళ్లినా రాని క్రమ శిక్షణ గుడికెళ్తే వస్తుందన్నారు.