Andhra Pradesh: ఏపీకి రాజధాని గురించి అడిగిన ప్రశ్నకు బదులివ్వని జీఎన్ రావు కమిటీ

  • రాజధాని ఏదన్నది చెప్పడం మా పని కాదు
  • వరద ముప్పులేని ప్రాంతంలో రాజధాని ఉండాలి
  • తుళ్లూరులో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తి చేయాలి

ఏపీకి రాజధాని ఏదని అడిగిన ప్రశ్నకు జీఎన్ రావు నిపుణుల కమిటీ బదులివ్వలేదు. ఏపీ రాజధానిపై నియమించిన జీఎన్ రావు కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడింది. రాజధాని ఏదన్నది చెప్పడం తమ పని కాదన్న కమిటీ, వరద ముప్పులేని ప్రాంతంలో రాజధాని ఉండాలని చెప్పడం గమనార్హం. వరదముప్పు ఉన్న ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలు వద్దని, తుళ్లూరులో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తి చేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధి చేసుకోవాలని సూచించింది.

Andhra Pradesh
Amaravathi
GN Rao
committee
  • Loading...

More Telugu News