Jagan: సీఎం జగన్ తో ముగిసిన జీఎన్ రావు కమిటీ సమావేశం.. నివేదిక సమర్పణ

  • రాజధాని, రాష్ట్ర అభివృద్థిపై కమిటీ నియామకం
  • తుది నివేదికను సీఎంకు సమర్పించిన కమిటీ
  • నివేదికపై కమిటీ మీడియాతో మాట్లాడే అవకాశం

ఏపీ రాజధానిపై నియమించిన జీఎన్ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పటికే ఓసారి మధ్యంతర నివేదిక ఇచ్చిన జీఎన్ రావు కమిటీ తాజాగా పూర్తి వివరాలతో నివేదికను సీఎంకు సమర్పించింది. ఈ మేరకు సీఎం జగన్ తో రాజధాని అధ్యయన కమిటీ సమావేశం ముగిసింది. రాజధాని సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై తుది నివేదికను ముఖ్యమంత్రి ముందు ఉంచింది. సీఎం జగన్ తో జీఎన్ రావు నిపుణుల కమిటీ గంటన్నరపాటు సమావేశమైంది. తమ నివేదికలో అనేక సిఫారసులను పొందుపరిచిన కమిటీ, వాటిని సీఎంకు వివరించింది. అంతేకాదు, అధ్యయన అంశాలను, ప్రజల అభిప్రాయాలను సీఎంకు తెలిపింది. మరికాసేపట్లో జీఎన్ రావు కమిటీ మీడియా ముందుకు వచ్చి నివేదికలోని అంశాలు వెల్లడించే అవకాశం ఉంది.

Jagan
Andhra Pradesh
GN Rao
Committee
Amaravathi
Capital
  • Loading...

More Telugu News