Ganta Srinivasa Rao: పాక్షికంగా పాడైన ఇళ్లకు 10 వేల రూపాయలు చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా: గంటా

  • విశాఖ నార్త్ నియోజకవర్గంలో పర్యటించిన గంటా
  • పాడైన ఇళ్ల పరిశీలన
  • పారిశుద్ధ్యలేమిపై అధికారులకు సూచనలు

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్ నియోజకవర్గంలోని ఏఎస్సార్ నగర్ జేఎన్ఎన్ఆర్ఎమ్ గృహసముదాయాల వద్ద పర్యటించారు. అక్కడ కొన్ని నివాస గృహాలు మరమ్మతులకు నోచుకోని స్థితిలో ఉండడం గమనించిన ఆయన, పాక్షికంగా పాడైన ఇళ్లకు రూ.10 వేల చొప్పున మంజూరు చేస్తున్నారని, ఇప్పుడు కూడా అలాగే మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా, ఏఎస్సార్ నగర్ లో పారిశుద్ధ్యలేమి కనిపించడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. చెత్త తొలగించడం ద్వారా దోమల బెడద నివారించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇటీవల మంజూరైన రూ.80 లక్షల నిధులతో పారిశుద్ధ్యం, ఇతర అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు.

Ganta Srinivasa Rao
Telugudesam
Vizag
  • Loading...

More Telugu News