Andhra Pradesh: సీఎం గారూ,రాజధాని వ్యవహారంలో మీ వ్యాఖ్యలు తప్పు కదూ!: వర్ల రామయ్య

  • సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన వర్ల రామయ్య
  • తప్పు సవరించుకోవాలని హితవు
  • ప్రజలు ఎవరితో చెప్పుకోవాలంటూ ట్వీట్

ఏపీ సీఎం జగన్ రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శకులకు పనికల్పిస్తున్నాయి. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య ట్వీట్ చేశారు. సీఎం గారూ, రాజధాని వ్యవహారంలో మీ వ్యాఖ్యలు తప్పు కదూ, సవరించుకోండి అంటూ హితవు పలికారు. తుగ్లక్ పరిపాలన అంటే మీకు కోపం... కానీ ప్రజల్లో రాజధానిపై ఉన్న గందరగోళాన్ని తొలగించి వారి సందేహాలను నివృత్తి చేయాల్సిన ప్రభుత్వమే అయోమయం సృష్టిస్తే ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి? అంటూ ప్రశ్నించారు.

Andhra Pradesh
Amaravathi
Jagan
Telugudesam
Varla Ramaiah
YSRCP
  • Loading...

More Telugu News