Siddharth: చెన్నైలో పౌరసత్వ సవరణ చట్టం నిరసనలు... హీరో సిద్ధార్థ్ పై కేసు!

  • ఇప్పటికీ ఆగని నిరసనలు
  • చెన్నైలోనూ ఆందోళనలు
  • నిరసన ప్రదర్శన చేపట్టిన రాజకీయపక్షాలు, విద్యార్థి సంఘాలు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశం నలుమూలలలా నిరసనజ్వాలలు చెలరేగుతున్నాయి. చెన్నైలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా, చెన్నైలోని వళ్లువార్ కొట్టంలో భారీస్థాయిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు నిర్వహించిన ఈ నిరసనలో హీరో సిద్ధార్థ్ కూడా పాల్గొన్నాడు. అయితే ఈ ఆందోళనలో పాల్గొన్న నిరసనకారులపై పోలీసులు 143 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో హీరో సిద్ధార్థ్ పైనా కేసు నమోదైంది. అనుమతి లేకుండా నిరసన చేపట్టారని పోలీసులు ఆరోపించారు.

Siddharth
Hero
Tollywood
CAA
NRC
Kollywood
NDA
BJP
Chennai
  • Loading...

More Telugu News