Nagarkurnool District: డెలివరీ సమయంలో శిశువు తలను కోసేసిన డాక్టర్.. తల్లి గర్భంలోనే ఉండిపోయిన మొండెం!

  • నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం
  • డెలివరీ సందర్భంగా నిర్లక్ష్యంతో వ్యవహరించిన డాక్టర్
  • తల్లి పరిస్థితి ఆందోళనకరం

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చెంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళకు డెలివరీ చేస్తున్న సందర్భంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ శిశువు తలను కోసేశారు. దీంతో, తలలేని శిశువు మృతదేహం తల్లి గర్భంలోనే ఉండిపోయింది. ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న మహిళను హుటాహుటిన హైదరాబాదులోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మరోవైపు, సదరు మహిళ బంధుమిత్రులు ఆసుపత్రిపై దాడి చేశారు. ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.

Nagarkurnool District
Delivery
  • Loading...

More Telugu News