navy: నౌకాదళంలో కలకలం.. పాక్ తో సంబంధాల ఆరోపణలతో ఏడుగురు నౌకాదళ సిబ్బంది అరెస్టు

  • గూఢచర్య వ్యవహారం కేసులో అరెస్టు చేసిన విశాఖ పోలీసులు
  • నావికాదళ ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘావర్గాల సంయుక్త ఆపరేషన్
  • హవాలా ఆపరేటర్ నూ అదుపులోకి తీసుకున్న ఇంటెలిజన్స్ అధికారులు
  • విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు నిందితుల తరలింపు

భారత నౌకాదళంలో కలకలం చెలరేగింది. పాకిస్థాన్ తో సంబంధాలు కొనసాగిస్తోన్న ఆరోపణలతో ఏడుగురు నౌకాదళ సిబ్బంది అరెస్టయ్యారు. నావికాదళ ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘావర్గాల సంయుక్త ఆపరేషన్ లో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. తూర్పు నౌకాదళ కమాండ్ కు కీలకమైన డాల్ఫిన్స్ నోస్ కేంద్రంగా గూఢచర్యం రాకెట్ కొనసాగుతోందని గుర్తించిన అధికారులు దీనితో సంబంధమున్న వారిని పక్కా ప్రణాళికతో అరెస్టు చేశారు.

మొత్తం ఏడుగురు నౌకాదళ సిబ్బందిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేసి విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు తరలించారు. మరోవైపు హవాలా ఆపరేటర్ ను కూడా ఇంటెలిజన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.

navy
Pakistan
India
Vizag
Vijayawada
  • Loading...

More Telugu News