nagababu: 'అదిరింది' షూటింగ్ లో నాగబాబు ఉత్సాహంగా డ్యాన్స్.. ఫొటోలు వైరల్

  • 'జబర్దస్త్' కామెడీ షో నుంచి తప్పుకున్న నాగబాబు
  • జీ తెలుగులో మరో కార్యక్రమంలో మెగా బ్రదర్
  • 'అదిరింది' స్టేజ్ పై కనిపించడానికి సిద్ధం

సినీనటుడు నాగబాబు ఈటీవీ 'జబర్దస్త్' కామెడీ షో నుంచి తప్పుకుని, జీ తెలుగులో మరో కార్యక్రమానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన 'అదిరింది' స్టేజ్ పై కనిపించడానికి సిద్ధమవుతూ కొత్త అవతారంలో కనపడుతున్నారు. ఈ షోలో ఫేమస్ కమేడియన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. 'అదిరింది' షూటింగ్ సందర్భంగా నాగబాబు దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
    
   ఈటీవీ 'జబర్దస్త్' కామెడీ షోలో నాగబాబు డ్యాన్స్  వేయలేదు. ఎంట్రీ ఇచ్చే సమయంలో యాంకర్లు, రోజా మాత్రం డ్యాన్సులు వేసేవారు. కానీ, 'అదిరింది'లో మాత్రం ఎంట్రీ ఇచ్చే సమయంలో నాగబాబు డ్యాన్స్ వేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆదివారం రాత్రి 9 గంటలకు ఈ సరికొత్త షోను ప్రేక్షకులు చూడొచ్చు.          
పవన్ కల్యాణ్ పోజులో నాగబాబు   

nagababu
Jana Sena
Tollywood
  • Loading...

More Telugu News