Buchayya choudary: భూములు తిరిగిచ్చేస్తారు...నిర్మాణాలేం చేస్తారు? : వైసీపీ మంత్రులకు బుచ్చయ్య చౌదరి ప్రశ్న

  • బుద్ధిలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడమేనా?
  • పులివెందుల గ్యాంగులు అన్ని ప్రాంతాలకు విస్తరించాయి 
  • రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీయే

బాధ్యతగా మాట్లాడాల్సిన వైసీపీ మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. మూడు రాజధానులంటూ రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు నెలకొనేలా చిచ్చు పెట్టడమేకాక, నిరసన గళం వినిపిస్తున్న అమరావతి రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

'భూములిచ్చిన మా పరిస్థితి ఏమిటి? అని రైతులు ప్రశ్నిస్తుంటే...సింపుల్ గా మీ భూములు మీకిచ్చేస్తాం...అని సమాదానం చెబుతున్నారని, మరి కొన్ని భూముల్లో ఇప్పటికే జరిగిన నిర్మాణాల సంగతి ఏమిటని ప్రశ్నించారు. ఆ నిర్మాణాలను కూడా కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో అధికారం మారాక పులివెందుల రాజ్యంగా మారిపోయిందని, పులివెందుల గ్యాంగులు రాష్ట్రమంతటా విస్తరించాయని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీయే కొనసాగుతోందని, ఇప్పుడు కూడా రాజధాని పేరుతో కొత్త రకం దోపిడీకి తెరలేపుతున్నారని ఆరోపించారు.

Buchayya choudary
three capitals
farmers
amaravathi
  • Loading...

More Telugu News