JC Diwakar Reddy: దమ్ముంటే గన్ మెన్ లేకుండా ప్రజల్లో తిరుగు: జేసీకి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సవాల్

  • పోలీసు శాఖలో బూట్లు నాకేవారు ఉండరు
  • పోలీసు వ్యవస్థను జేసీ సోదరులు 30 ఏళ్లుగా వాడుకుంటున్నారు
  • జేసీ సోదరులను అరెస్ట్ చేయాలి

పోలీసులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిపై తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మండిపడ్డారు. పోలీసు శాఖలో బూట్లు నాకేవారు ఉండరని... బుల్లెట్లు వాడేవారే ఉంటారని ఆయన అన్నారు. నోటి దురుసుతో పోలీసులను దుర్భాషలాడుతున్నారని విమర్శించారు. జిల్లాలోని పోలీసు వ్యవస్థను జేసీ సోదరులు 30 ఏళ్లుగా వాడుకుంటున్నారని అన్నారు. జేసీ సోదరులకు దమ్ముంటే గన్ మెన్లు లేకుండా ప్రజల్లో తిరగాలని డిమాండ్ చేశారు. 16 కేసుల్లో నిందితులుగా ఉన్న జేసీ సోదరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

JC Diwakar Reddy
Peddareddy
Tadipathri
  • Loading...

More Telugu News