Jagan: విశాఖను పూర్తి స్థాయి రాజధానిని చేస్తారనిపిస్తోంది: ఐవైఆర్ కృష్ణారావు

  • జగన్ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు
  • అమరావతిలో అసెంబ్లీ సమావేశాలను కుదిస్తారు
  • హైకోర్టు కర్నూలులో ఉంటుంది

ఏపీ రాజధానిపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలంలో ఏపీ రాజధానిగా విశాఖపట్టణం అవతరిస్తుందని ఆయన అంచనా వేశారు. హైకోర్టు కర్నూలులో ఉంటుందని చెప్పారు.

రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నట్టు అనిపిస్తోందని అన్నారు. శాసనసభ రాజధానిగా అమరావతి అనే తాయిలం చూపి... పరిపాలన రాజధానిని విశాఖకు మార్చడం... ఆపై అమరావతిలో అసెంబ్లీ సమావేశాలను కుదించడంలాంటివి క్రమంగా జరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత దీర్ఘకాలంలో పూర్తి స్థాయిలో విశాఖను రాజధానిగా చేస్తారనిపిస్తోందని తెలిపారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

Jagan
IYR Krishna Rao
YSRCP
Amaravathi
  • Loading...

More Telugu News