G.Karunakar reddy: మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రిని అడిగా: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి

  • మంత్రి పదవి రేసులో నేనూ ఉన్నా
  • హరపనహళ్లిని జిల్లా కేంద్రంగా చేయాలన్న ఒత్తిడి ఉంది
  • బళ్లారిని విభజించి విజయనగర జిల్లాగా ఏర్పాటు చేసే యోచన

కేబినెట్‌లో తనకు స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి యడియూరప్పను కోరినట్టు బీజేపీ హరపనహళ్లి ఎమ్మెల్యే జి.కరుణాకర్‌రెడ్డి తెలిపారు. మంత్రి పదవి రేసులో తానూ ఉన్నానని పేర్కొన్నారు. నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. హరపనహళ్లిని జిల్లా కేంద్రంగా చేయాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయని పేర్కొన్న ఆయన ఈ విషయంలో పోరాట సమితి నాయకులతో కలిసి ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించినట్టు చెప్పారు. సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా కోరినట్టు వివరించారు.

బళ్లారి జిల్లాను విభజించి విజయనగర జిల్లా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన సభలో పలు అనుకూల, వ్యతిరేక అంశాలు ఎదురైనట్టు చెప్పారు. ఈ విషయంలో సంఘ సంస్థల నాయకులు, పోరాట సమితి పదాధికారుల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామని కరుణాకర్‌రెడ్డి తెలిపారు.

G.Karunakar reddy
Karnataka
BJP
  • Loading...

More Telugu News