Telangana HRC Chairman B.Chandraiah: తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ వెంకటరాములు.. హెచ్చార్సీ ఛైర్మన్ గా బి.చంద్రయ్య నియామకం
- ఉపలోకాయుక్తగా నిరంజన్ రావు
- హెచ్చార్సీ సభ్యులుగా ఆనందరావు, ఇర్ఫాన్ మొయినుద్దీన్
- గవర్నర్ ఉత్తర్వులు జారీ
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ గా బి.చంద్రయ్య నియామకం అయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉత్తర్వులు జారీచేశారు. మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా ఎన్.ఆనందరావు, ఇర్ఫాన్ మొయినుద్దీన్ ను నియమించారు. ఈ నియామకాలకు సంబంధించి కమిటీ సిఫారసుల మేరకు వీరిని నియమించినట్లు గవర్నర్ తెలిపారు. కాగా, తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ వెంకటరాములు నియమితులయ్యారు. ఉపలోకాయుక్తగా నిరంజన్ రావును నియమిస్తూ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-81eedd4b8bc22551b7263882dc17c7a76ed5aebc.jpeg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-8a127ac51b6fa00c7a921424cd29479e2489926e.jpeg)