jamia Milia university: జామియా నమాజ్ వేళలో రక్షణగా ఇతర మతస్థుల మానవహారం

  • మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఘటన
  • ఓవైపు 'సీఏఏ'ను నిరసిస్తూ ఆందోళనలు సాగిన నేపథ్యం
  • మధ్యాహ్నం నమాజ్ చేస్తున్న ముస్లింలకు ఇతర మతస్థుల రక్షణహారం

సీఏఏపై ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన, పోలీసుల నియంత్రణలతో ఉద్రిక్తంగా పరిస్థితులున్నప్పటికీ.. యూనివర్సిటీ వద్ద మానవత్వాన్ని చాటే అరుదైన ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం నమాజ్ వేళలో ముస్లింలు యూనివర్సిటీ గేట్ బయట నమాజ్ కుపక్రమించారు. ఈ సమయంలో వీరికి రక్షణగా ఇతర మతాలకు చెందిన వారు మానవహారంగా నిలిచి తమ ఉదారతను చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ కాగా కొన్ని గంటల్లోనే లక్షల సంఖ్యల్లో లైక్ లను పొందాయి.

jamia Milia university
Namaj
Non Muslims Human chain
Delhi
  • Error fetching data: Network response was not ok

More Telugu News