Andhra Pradesh: ఏపీ ఎస్సార్టీసీ కార్మికులకు శుభవార్త.. పండగ అడ్వాన్స్ మంజూరు

  • ‘సంక్రాంతి’ అడ్వాన్స్ కోసం రూ.19 కోట్లు మంజూరు
  • జనవరి 1న వేతనంతో కలిపి చెల్లించాలి
  • ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఉత్తర్వులు

ఏపీ ఎస్సార్టీసీ కార్మికులకు  శుభవార్త. కార్మికులకు సంక్రాంతి పండగ అడ్వాన్స్ కోసం రూ.19 కోట్లు మంజూరు చేసినట్టు యాజమాన్యం ప్రకటించింది. జనవరి 1న వేతనంతో కలిపి చెల్లించాలని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. క్లాస్-3 కేటగిరిలో పనిచేసే ఉద్యోగులకు రూ.4500, క్లాస్-4 కేటగిరిలో పని చేసే ఉద్యోగులకు రూ.4 వేల చొప్పున అడ్వాన్స్ ఇవ్వనున్నారు. ఉద్యోగుల వేతనాల నుంచి పది నెలల్లోగా అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బును రికవరీ చేసుకుంటారు. 

Andhra Pradesh
Apsrtc
  • Loading...

More Telugu News