Hyderabad: బేగంపేటలోని ఓ పబ్ లో అశ్లీల వ్యవహారం.. పోలీసుల అదుపులో యాజమాన్యం, అమ్మాయిలు!

  • బేగంపేటలో ఉన్న లిస్బన్ రెస్టారెంట్ అండ్ పబ్ 
  • కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎరగా యువతులు
  • ఎంతగా ఆకట్టుకుంటారో అంతగా నజరానాలు

కస్టమర్లను ఆకట్టుకునేందుకు అమ్మాయిలను ఎరగా వేసి తమ ఆదాయం పెంచుకునేందుకు ఓ రెస్టారెంట్ అండ్ పబ్ చేస్తున్న అభ్యంతరకర వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న లిస్బన్ రెస్టారెంట్ అండ్ పబ్ లో ఈ గలీజ్ దందా జరుగుతున్నట్టు సమాచారం అందడంతో వెస్ట్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. గత అర్ధరాత్రి సమయంలో లిస్బన్ పబ్ పై పోలీసులు దాడి చేశారు. 30 మందికి పైగా అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 తమ రెస్టారెంట్ అండ్ పబ్ కు వచ్చే యువకులను ఆకర్షించేందుకు ఆ అమ్మాయిలతో అశ్లీల పనులు చేయిస్తున్నట్టు పోలీసుల సమాచారం. కస్టమర్లను ఎవరైతే ఎక్కువగా ఆకట్టుకుంటారో, మద్యం కొనేలా చేస్తారో ఆ అమ్మాయి లేదా అమ్మాయిలకు నజరానాల కింద సొమ్ము, గిప్ట్ లను యాజమాన్యం ముట్టచెబుతున్నట్టు తెలిసింది. పబ్ యాజమాన్యం ప్రోద్బలం మేరకే తాము ఈ విధంగా చేస్తున్నట్టు పోలీసుల అదుపులో ఉన్న యువతులు చెప్పినట్టు సమాచారం. లిస్బన్ పబ్ యాజమాన్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంది. పబ్ ను సీజ్ చేశారు.  

Hyderabad
Begumpet
Lisban Restaurant and pub
Raids
West zone
Task police
Arrest
  • Loading...

More Telugu News