Chiranjeevi: శిరీష్ కోసం రంగంలోకి దిగిన చిరంజీవి

  • హిట్ కోసం అల్లు శిరీష్ పాట్లు 
  • ఒక కథను ఓకే చేసిన చిరంజీవి 
  •  దర్శకుడిగా రాకేశ్ శశి

హీరోగా అల్లు శిరీష్ బరిలోకి దిగి చాలా కాలమే అయింది. అయితే ఒకటి రెండు సక్సెస్ లు తప్ప, చెప్పుకోదగిన విజయాలు మాత్రం ఆయన ఖాతాలో నమోదు కాలేదు. దాంతో సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే వున్నాడు. ఇటీవల కథల ఎంపిక విషయంలో సాయిధరమ్ తేజ్ కాస్త గాడి తప్పడంతో, చిరంజీవి ఆయన కెరియర్ ను సెట్ చేసే పనిలో పడ్డారు. తేజూ సినిమాలకి సంబంధించిన కథలను ముందుగా ఆయన వింటున్నారు.

అలాగే శిరీష్ కెరియర్ కి సంబంధించిన విషయంపై కూడా చిరంజీవి శ్రద్ధ పెట్టినట్టుగా చెబుతున్నారు. అతని కోసం కొత్తగా ఆయన ఒక కథ విన్నారట. గతంలో కల్యాణ్ దేవ్ హీరోగా చేసిన 'విజేత' సినిమాకి దర్శకత్వం వహించిన రాకేశ్ శశి వినిపించిన ఒక కథ చిరంజీవికి బాగా నచ్చిందట. 'విజేత' పెద్దగా ఆడనప్పటికీ ఆ దర్శకుడు వినిపించిన కథకి చిరంజీవి ఓకే చెప్పడం విశేషం. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు.

Chiranjeevi
Allu Sirish
  • Loading...

More Telugu News