Telugudesam: కొందరు వరెస్ట్ పోలీసులపైనే ఆ వ్యాఖ్యలు చేశాను: జేసీ దివాకర్ రెడ్డి

  • నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను
  • పోలీసులు వెన్నెముక లేకుండా వంగిపోతున్నారు
  • ఏ ఒక్క పోలీసు గురించీ నేను చెప్పడం లేదు

నిన్న అనంతపురంలో పోలీసులను ఉద్దేశించి టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీ పోలీస్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జేసీ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, కొందరు వరెస్ట్ పోలీసుల పైనే ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు. పోలీసులు వెన్నెముక లేకుండా వంగిపోతున్నారని, ఏ ఒక్క పోలీసు గురించి తాను వ్యాఖ్యలు చేయడం లేదని సమర్థించుకున్నారు. ఏపీలో మూడు రాజధానుల అంశంపై జేసీ స్పందిస్తూ, అసెంబ్లీ, పరిపాలన విభాగం రెండూ ఒకేచోట పెట్టాలని, వాటిని వేర్వేరు చోట్ల పెట్టే అవివేకుడు జగన్ కాదని వ్యాఖ్యానించారు.

Telugudesam
Jc Diwakar Reddy
Anantapur District
  • Loading...

More Telugu News