Nara Lokesh: వేణుగోపాలరాజు అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది: నారా లోకేశ్

  • పార్టీకి, ప్రజలకు ఎంతో సేవ చేశారు
  • కుటుంబసభ్యులను పరామర్శించాను
  • వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చాను 

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత వేణుగోపాల రాజు మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను ఈ రోజు టీడీపీ యువనేత నారా లోకేశ్ పరామర్శించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో తెలుపుతూ ఆ కుటుంబానికి అండగా ఉంటానన్నారు.

'పార్టీకి, ప్రజలకు ఎంతో సేవ చేసిన పెనమలూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, భట్రాజు కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేసిన వేణుగోపాల రాజు అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించాను. వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చాను' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

Nara Lokesh
Andhra Pradesh
Krishna District
  • Loading...

More Telugu News