amaravati: అమరావతిలో అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసినవారికి సీఆర్‌డీఏ కేటాయించిన ప్లాట్లను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

  • నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు
  • అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసినవారికి ల్యాండ్‌ పూలింగ్‌ కింద గతంలో ప్లాట్లు 
  • ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ యాక్ట్‌ 1977 ప్రకారం చట్ట విరుద్ధం 
  • దీంతో ప్లాట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గతంలో పేదలు, దళితులకు మంజూరు చేసిన అసైన్డ్‌ భూములను కొందరు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసినవారికి ల్యాండ్‌ పూలింగ్‌ కింద సీఆర్‌డీఏ కేటాయించిన ప్లాట్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.

ఈ భూములను కొనుగోలు చేయడం ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ యాక్ట్‌ 1977 ప్రకారం చట్ట విరుద్ధం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అసైన్డ్‌ భూములు సేకరించడం, అందుకు బదులుగా వారికి ప్లాట్లు కేటాయించడం కూడా నిబంధనలకు విరుద్ధమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్‌ పూలింగ్‌ చట్టం 2015 ప్రకారం రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించిన విషయం తెలిసిందే. అసైన్డ్‌ ప్లాట్ల కేటాయింపులు రద్దు చేయాలని ఇటీవలే మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News