amaravathi: సీఎం జగన్ ప్రకటన ఎఫెక్ట్.. నేడు రాజధానిలో బంద్‌కు రైతుల పిలుపు.. అమరావతిలో 144 సెక్షన్!
- 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు
- మూతపడనున్న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు
- చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న డీఎస్పీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పోలీసులు 144, 34 సెక్షన్ విధించారు. ఈ మేరకు తుళ్లూరు డీఎస్పీ తెలిపారు. రైతులు తమ ఆందోళనను శాంతియుతంగా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించాలని కోరారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.
ఏపీ రాజధాని మూడు ప్రాంతాల్లో ఉంటుందన్న ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో రైతులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్, 34 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. బంద్ నేపథ్యంలో పాఠశాలలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు మూతపడనున్నాయి. తమ ఆందోళనల్లో భాగంగా రైతులు, కూలీలు వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలను ప్రారంభించనున్నారు. అలాగే, 29 గ్రామాల్లోని ఆయా గ్రామ సచివాలయాల వద్ద కూడా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నారు.