comedian ali: టాలీవుడ్ హాస్యనటుడు అలీకి మాతృ వియోగం

  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైతున్ బీబీ
  • రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు భౌతిక కాయం తరలింపు
  • నేటి సాయంత్రం అంత్యక్రియలు

ప్రముఖ సినీ నటుడు అలీ తల్లి జైతున్ బీబీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాజమహేంద్రవరంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. షూటింగ్ నిమిత్తం రాంచీలో ఉన్న అలీ.. తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. కాగా, జైతున్ బీబీ భౌతిక కాయాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. నేటి సాయంత్రం హైదరాబాద్ ‌లో జైతున్ అంత్యక్రియలు జరగనున్నాయి.

comedian ali
Tollywood
mother
died
  • Loading...

More Telugu News