union minister: కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ మొబైల్ ఫోన్‌ తస్కరణ!

  • బీహార్‌లోని బెగూసరాయ్‌లో ఘటన
  • అతిథి గృహంలో మంత్రి ఫోన్‌ను కొట్టేసిన చోరులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి సహాయకుడు

కేంద్ర పశుసంవర్థక శాఖ, డెయిరీ, మత్స్యశాఖల మంత్రి గిరిరాజ్‌సింగ్ మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. బీహార్‌లోని బెగూసరాయ్ పట్టణంలో జరిగిందీ ఘటన. మంత్రి తన సొంత నియోజకవర్గమైన బెగూసరాయ్‌లోని రిఫైనరీ టౌన్‌షిప్ అతిథి గృహంలో దిగారు. ఈ సందర్భంగా మంత్రి మొబైల్ ఫోన్ చోరీకి గురైందని ఆయన సలహాదారు అవనీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మొబైల్‌లో మంత్రి వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు, నమో యాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలకు సంబంధించిన వివరాలు ఉన్నట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

union minister
Bihar
mobile phone
theft
  • Loading...

More Telugu News