Andhra Pradesh: సీఎం జగన్ కు వ్యక్తిగత భద్రత పెంపు

  • ప్రస్తుత భద్రతా సిబ్బందికి అదనంగా సిబ్బంది 
  • ‘ఆక్టోపస్’ కమాండోల బృందంతో భద్రత
  • ఈ బృందంలో ఆరుగురు సభ్యులు

ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత భద్రతను మరింత పెంచారు. ప్రస్తుతం ఉన్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్ల్యూ)తో పాటు మరికొందరు సీఎం రక్షణ బాధ్యతను చూడనున్నారు. ఏపీ పోలీస్ విభాగంలో కీలకమైన ‘ఆక్టోపస్’లోని ప్రత్యేక కమాండోల బృందం ఆయనకు భద్రతగా ఉంది. సీఎం నివాసం వద్ద ఈరోజు నుంచి విధులు చేపట్టారు. ప్రత్యేక శిక్షణ పొందిన ఈ బృందంలో 30 మంది సభ్యులు ఉన్నారు. ఆరుగురు సభ్యుల చొప్పున ఐదు బృందాలుగా ఏర్పడి నిర్దేశించిన విధులు చేపడతారు. సీఎం వెంటే ఉండే ప్రత్యేక కమాండోలు, పర్యటనలు, సభలు, సమావేశాలు ఉన్న సందర్భాల్లో షిఫ్ట్ ల వారీగా పనిచేస్తారు.

Andhra Pradesh
cm
Jagan
octopus
Ap police
  • Loading...

More Telugu News