Andhra Pradesh: రాజధానిగా అమరావతి ఓ గుర్తింపు తెచ్చుకుంది, ఇప్పుడు మార్చుతుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదు: సుజనా చౌదరి

  • ఏపీ రాజధానిపై సీఎం జగన్ వ్యాఖ్యలు
  • మూడు రాజధానులు ఉండొచ్చన్న జగన్
  • ఖండిస్తున్న విపక్షాలు

ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో రాజధానిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని జగన్ సూచనప్రాయంగా తెలియజేశారు. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. తాజాగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కూడా స్పందించారు.

రాజధానిగా అమరావతి ఇప్పటికే ఓ గుర్తింపు తెచ్చుకుందని, ఇప్పుడేదో జగన్ చిన్నపిల్లల ఆటలా రాజధానిని మార్చుతామంటే కుదరదని అన్నారు. ఏపీ రాజధానిని మార్చుతుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. నాడు సచివాలయ ఉద్యోగులు ఎంతో శ్రమకోర్చి హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చారని, సీఎం జగన్ ఇష్టంవచ్చినట్టు వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. సీఎం జగన్ వ్యాఖ్యలు అర్థరహితమని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని, రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.

  • Loading...

More Telugu News