Hollywood Actress Charles Theren Inteview: మమ్మల్ని చంపబోతే... అమ్మే నాన్నను హతమార్చింది: బాలీవుడ్ నటి చార్లీస్ థెరోన్

  • తాగుబోతైన తన తండ్రి నిత్యం నరకం చూపెట్టేవాడు  
  • ఈ విషయం తెలపడానికి సిగ్గుపడటం లేదు
  • ఆత్మరక్షణకు అమ్మే నాన్నను చంపింది

తన తల్లే తన తండ్రిని చంపివేసిందని హాలీవుడ్ నటి చార్లీస్ థెరోన్ తెలిపారు. తాగుబోతైన తన తండ్రి నిత్యం తమకు నరకం చూపెట్టేవాడని థెరోన్ చెప్పారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. 1991 జూన్ లో దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న సమయంలో తన తాగుబోతు తండ్రి తమపై దాడికి సిద్ధపడ్డాడని, ఈ ఘటనకు సంబంధించి మాట్లాడానికి సిగ్గుపడటం లేదన్నారు.

‘నా తండ్రి మద్యానికి బానిస. చాలా బలహీనమైన వ్యక్తి. నా చిన్నతనం నుంచి 15 ఏళ్ల వయసు వరకు అలానే ఉన్నాడు. మాకు జీవితంపై ఆశలు చచ్చిపోయాయి. ఆయన వల్ల మా కుటుంబం కష్టాల్లో కూరుకుపోయింది. నా జీవితంలో ఆరోజు లేకపోతే బాగుండేదని అనిపిస్తుంది.

ఆ రోజు మా నాన్న బాగా తాగి నడవలేని స్థితిలో ఉండి కూడా చేతిలో తుపాకి పట్టుకుని ఇంటికి వచ్చాడు. నేను, అమ్మ బెడ్ రూంలో ఉన్నాము. నాన్న తలుపును తెరవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను, అమ్మ తలుపు తెరవడానికి వీల్లేకుండా అడ్డంగా నిలుచున్నాం. ఆయన దూరంగా వెళ్లి తలుపుపై మూడుసార్లు కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తు ఒక్క బుల్లెట్ కూడా మాకు తగల్లేదు. చివరికి ఆత్మ రక్షణకోసం అమ్మ నాన్నను చంపేసింది. ఇలాంటి సమస్యలు అనేక మంది ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని చాలామందితో పంచుకున్నాను. తాజాగా మీకు చెబుతున్నాను’ అని  థెరోన్ చెప్పారు.

Hollywood Actress Charles Theren Inteview
My mother killed My dad
  • Loading...

More Telugu News