Congress: కాంగ్రెస్ నేత శశి థరూర్ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

  • ఏన్ ఎరా ఆఫ్ డార్క్ నెస్ అనే పుస్తకం రాసిన థరూర్
  • నాన్ ఫిక్షన్ విభాగంలో అవార్డు 
  • భారతదేశంపై బ్రిటీష్ వలస పాలకుల ప్రభావం నేపథ్యం

కాంగ్రెస్ పార్లమెంటు సభ్యడు శశి థరూర్ నడిచే ఎన్ సైక్లోపీడియా అని చెప్పాలి. ప్రతి విషయంపైనా స్పష్టమైన అవగాహన కలిగివుంటారు. ఆయనకు తెలిసినన్ని ఆంగ్ల, ఆంగ్లేతర భాషల పదాలు మరే ఇతర రాజకీయనేతకు తెలియవంటే అతిశయోక్తి కాదు. శశి థరూర్ మంచి రచయిత కూడా. ఇప్పుడు ఆయనలోని రచయితకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. శశి థరూర్ ఆంగ్లంలో రాసిన 'ఏన్ ఎరా ఆఫ్ డార్క్ నెస్' అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నాన్ ఫిక్షన్ కేటగిరీలో ఈ పుస్తకాన్ని అవార్డుకు ఎంపిక చేశారు. భారతదేశంపై బ్రిటీష్ వలస పాలకుల ప్రభావం గురించి థరూర్ తన పుస్తకంలో చర్చించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News