Sapthabhumi: తెలుగు నవల 'శప్తభూమి'కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

  • తెలుగు నవలకు జాతీయస్థాయి గుర్తింపు
  • 'శప్తభూమి'కి అవార్డు ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ
  • రాయలసీమ నేపథ్యంలో 'శప్తభూమి' రచన

ఓ తెలుగు నవలకు మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. బండి నారాయణస్వామి రచించిన 'శప్తభూమి' నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర సాహిత్య అకాడమీ ఓ ప్రకటనలో తెలిపింది. రచయిత బండి నారాయణస్వామి 'శప్తభూమి' నవల రాయలసీమ నేపథ్యంలో రచించారు. శ్రీకృష్ణదేవరాయల పాలన తదనంతరం సీమలో సంస్థానాలు, అక్కడి రాజకీయాలు, ప్రజల జీవితాల గురించి నారాయణస్వామి తన నవలలో అద్భుతంగా రాశారు. గతంలో తానా పోటీల్లోనే 'శప్తభూమి' నగదు బహుమతి గెలుచుకుంది.

Sapthabhumi
Bandi Narayanaswamy
Kendra Sahithya Academy
Award
Rayalaseema
Andhra Pradesh
  • Loading...

More Telugu News