cm: అసెంబ్లీ ‘మయసభ’ను మరిపిస్తోంది.. కౌరవులు ఆ పక్కన ఉన్నా పాండవులే గెలుస్తారు: చంద్రబాబు

  • ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావొస్తోంది
  • ఆదాయం గణనీయంగా పడిపోయింది
  • రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ తన తెలివితేటలు ఉపయోగించాలి

ఏపీ అసెంబ్లీ సమావేశాల గురించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. అనంతపురంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే ఏం జరుగుతోందో అందరూ చూశారని అన్నారు. ‘అసెంబ్లీ ‘మయసభ’ను మరిపిస్తోంది. కౌరవులు ఆ పక్కన ఉన్నా పాండవులే గెలుస్తారు.. న్యాయం పాండవుల సైడే ఉంటుంది’ అని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావొస్తోందని, ఆదాయం గణనీయంగా పడిపోయిందని విమర్శించారు. ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు, రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ తన తెలివితేటలు ఉపయోగించాలని, అంతేకానీ, తనపై ఆ తెలివితేటలు ప్రయోగించడం ‘మీ వల్ల కాదు’ అని హెచ్చరించారు.

cm
Jagan
Chandrababu
Anathapuram
  • Loading...

More Telugu News