Amit Shah: మీరు దేశానికి హోం మంత్రిలా మాట్లాడటం లేదు: అమిత్ షాపై మమతా బెనర్జీ ఫైర్

  • అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగానే వ్యవహరిస్తున్నారు
  • 35 శాతం ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది
  • వలసదారుల కోసం ఎన్ని నిర్బంధ శిబిరాలు కడుతున్నారు

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. అమిత్ షా దేశానికి హోం మంత్రిగా కాకుండా... బీజేపీ అధ్యక్షుడిగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మీరు కేవలం 35 శాతం ఓట్లతోనే అధికారంలోకి వచ్చారని... దేశంలోని 65 శాతం మంది ప్రజలు మీతో లేరనే విషయాన్ని అర్థం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. దేశంలో అక్రమ వలసదారుల కోసం ఎన్ని నిర్బంధ శిబిరాలు కడుతున్నారని ప్రశ్నించారు. జాతీయ పౌరుల జాబితా, పౌరసత్వ సవరణ చట్టం ఒకే లాలీపాప్ కు రెండు పార్వ్శాలని మమత అన్నారు. పశ్చిమబెంగాల్ లో వీటిని తాము అమలు చేసే ప్రసక్తే లేదని చెప్పారు.

Amit Shah
mamata banerjee
bjp
tmc
  • Loading...

More Telugu News