Anitha: ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే బుగ్గనకు అర్ధం తెలుసా: టీడీపీ నేత అనిత

  • అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న బుగ్గన
  • ఖండించిన అనిత
  • జగన్ పాలన తుగ్లక్ ను మించిపోయిందని ఎద్దేవా

గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని, రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వస్తున్న ఆరోపణలపై టీడీపీ మహిళా నేత అనిత స్పందించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అనిత ఖండించారు. అసలు మంత్రి బుగ్గనకు ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించారు.

రాజధాని ప్రాంతంలో ఎంతోమంది భూములు కొంటే, వారందరినీ చంద్రబాబుతో ముడిపెట్టడం దారుణమని అన్నారు. అంతేగాకుండా, సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనపైనా అనిత వ్యాఖ్యానించారు. ఒక రాజధానికే డబ్బులు లేవంటోన్న ప్రభుత్వం, మూడు రాజధానులు ఎలా నిర్మిస్తుందని ప్రశ్నించారు. జగన్ పాలన తుగ్లక్ పాలనను మించిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు.

Anitha
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh
Buggana
Amaravathi
  • Loading...

More Telugu News