Payal Rohatgi: జైల్లో నాకు నరకం కనిపించింది: సినీ నటి పాయల్ రోహత్గి

  • క్రిమినల్స్ మధ్య నన్ను ఉంచారు
  • చలిలో నేలపైనే పడుకున్నా
  • అదొక భయంకర అనుభవం

నెహ్రూ కుటుంబంపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి పాయల్ రోహత్గి ని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆమెను రిమాండుకి పంపింది. ఈ నేపథ్యంలో ఆమెను రాజస్థాన్ లోని బుండి జైల్లో ఉంచారు. ఆ మరుసటి రోజు కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది.

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జైల్లో తన అనుభవాన్ని పాయల్ పంచుకుంది. జైల్లో తనను క్రిమినల్స్ మధ్య ఉంచారని, రాత్రి తనకు నరకం కనిపించిందని తెలిపింది. చలిలోనే రాత్రంతా నేలపై పడుకున్నానని చెప్పింది. అదొక భయంకరమైన అనుభవమని... ఇంకెప్పుడూ జైలుకు వెళ్లకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపింది.

Payal Rohatgi
Bollywood
Jail
  • Loading...

More Telugu News