Yediyurappa: కర్ణాటకలో పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తాం: యడియూరప్ప

  • పౌరసత్వ చట్టాన్ని అమలు చేయబోమన్న పలు రాష్ట్రాలు
  • చట్టంపై దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు
  • ఇందిరా క్యాంటీన్ల పేర్లను మార్చబోమన్న యెడ్డీ

పౌరసత్వ సవరణ చట్టాన్ని కర్ణాటకలో అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. ఈ చట్టాన్ని తాము అమలు చేయబోమని పంజాబ్, పశ్చిమబెంగాల్ తో పాటు మరికొన్న రాష్ట్రాలు ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరులో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న ఇందిరా క్యాంటీన్ల పేరును మార్చే యోచన తమకు లేదని తెలిపారు. ఈ క్యాంటీన్ల పేరును 'మహర్షి వాల్మీకి అన్న కుటీర'గా మారుస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. మరోవైపు, పౌరసత్వ చట్టంపై దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చట్టం అమలుపై స్టే విధించాలన్న పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు కొట్టి వేసింది. అయితే, చట్టాన్ని తాము పరిశీలిస్తామని చెప్పింది.

  • Loading...

More Telugu News