Vizag: విశాఖలో నిలకడగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు

  • విశాఖలో రెండో వన్డే
  • టాస్ గెలిచిన విండీస్
  • మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా

తొలి వన్డే ఓటమి టీమిండియా ఆటగాళ్లలో కసి రేకెత్తించినట్టుంది! విశాఖలో జరుగుతున్న రెండో వన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్ ఎంతో నిలకడ ప్రదర్శిస్తున్నారు. అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపిస్తున్నారు. ఈ మ్యాచ్ లో విండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ కే మొగ్గుచూపింది. ప్రస్తుతం టీమిండియా 19 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 96 పరుగులు చేసింది. రాహుల్ అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా, రోహిత్ శర్మ 40 పరుగులతో ఆడుతున్నాడు.

Vizag
India
West Indies
Cricket
Rohit Sharma
KL Rahul
  • Loading...

More Telugu News