Citizenship Amendment Act: పౌరసత్వ సవరణ బిల్లుతో భారతీయ ముస్లింలకు సంబంధం లేదు: 'ఢిల్లీ జామా మసీదు' షాహి ఇమామ్ 

  • నిరసన వ్యక్తం చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు
  • నిరసన తెలిపే సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం ముఖ్యం
  • పౌరసత్వ సవరణ చట్టానికి, జాతీయ పౌర రిజిస్టర్ కు చాలా తేడా ఉంది

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పలుచోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమాం సయ్యద్ అహ్మద్ బుఖారీ స్పందిస్తూ... ఈ చట్టంతో భారతీయ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. నిరసన తెలపడం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కని... నిరసన వ్యక్తం చేయకుండా ఎవరూ ఆపలేరని అన్నారు. అయితే, నిరసనలు వ్యక్తం చేసే సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోవాలని సూచించారు. ఒక వీడియో ద్వారా ఆయన ఈ మేరకు స్పందించారు.

పౌరసత్వ సవరణ చట్టానికి, జాతీయ పౌర రిజిస్టర్ కు చాలా తేడా ఉందనే విషయాన్ని అందరూ గ్రహించాలని బుఖారీ తెలిపారు. పౌరసత్వ సవరణ బిల్లు ఇప్పటికే చట్ట రూపం దాల్చిందని... జాతీయ పౌర రిజిస్టర్ ఇంకా చట్టంగా మారలేదని చెప్పారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ ల నుంచి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్న ముస్లింలకు పౌరసత్వ సవరణ చట్టం ద్వారా భారత పౌరసత్వం లభించదని తెలిపారు. భారతీయ ముస్లింలకు దీంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

Citizenship Amendment Act
Shahi Imam Syed Ahmed Bukhari
  • Loading...

More Telugu News