Jagan: విజయసారెడ్డిగారూ... మీకు, జగన్ గారికి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా: బుద్ధా వెంకన్న

  • జగన్ శ్మశానంలో కూర్చొని పాలిస్తున్నారా?
  • జగన్ కు పాలన చేతకాదని మీరే ఒప్పుకున్నారు
  • బడుగు, బలహీనవర్గాల రైతులు ధనవంతులు కాకూడదా?

అమరావతిని శ్మశానం అని అవమానించిన ముఖ్యమంత్రి జగన్... ఇప్పుడు శ్మశానంలో కూర్చొని పాలిస్తున్నారా? అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. అమరావతిని భ్రమరావతి అని అంటున్న మీరు భ్రమల్లో ఉండి పాలిస్తున్నారా? అని అడిగారు. అధికారంలోకి వచ్చి 7 నెలలయిందని... రాజధాని ప్రాంతంలో 7 ఎకరాల్లో అయినా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపించగలిగారా? అని ప్రశ్నించారు. జగన్ పాలనకు పనికి రాడు, పాలన చేతకాదు అని స్వయంగా మీరే ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అని ఎద్దేవా చేశారు.

అమరావతిని రియలెస్టేట్ వెంచర్ లా తయారు చేశారని మీరు మాట్లాడటం దారుణం విజయసాయిరెడ్డిగారు అని బుద్ధా వెంకన్న అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన రైతులు ధనవంతులు కాకూడదా? అని ప్రశ్నించారు. ఇలాంటివారి కోసమే చంద్రబాబు ప్రపంచమంతా తిరిగి అమరావతికి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారని తెలిపారు. జగన్ గారిలా విదేశాల్లో సూట్ కేసు కంపెనీలను ఏర్పాటు చేసుకుని, సొంత కంపెనీల్లోకి డబ్బు మళ్లించి ప్రజలను దోచుకోలేదని మీకు, జగన్ కు గుర్తు చేస్తున్నానని చెప్పారు.

Jagan
Chandrababu
Budda Venkanna
Vijayasai Reddy
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News