Supreme Court: వాదనలు వినేందుకు సుప్రీంకోర్టుకు వచ్చిన 'నిర్భయ' తల్లిదండ్రులు

  • నిర్భయ కేసు దోషి అక్షయ్ రివ్యూ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ
  • ఉరిశిక్షను పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన దోషి అక్షయ్
  • శిక్ష అమలుకు మీడియా, ప్రజలు ఒత్తిడి తీసుకొస్తున్నారన్న న్యాయవాది

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నిర్భయ' హత్యాచారం కేసులో దోషి అక్షయ్‌ సింగ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. అక్షయ్ రివ్యూ పిటిషన్ లో ఇంప్లీడ్ అయ్యేందుకు నిర్భయ తల్లి అనుమతి కోరిన విషయం తెలిసిందే. ఇంప్లీడ్ పిటిషన్ వేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్ ఆర్.భానుమతి, అశోక్ భూషణ్, బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇరు వర్గాల వాదనలు వింటోంది.

ఉరిశిక్షను పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన దోషి అక్షయ్ తరఫున న్యాయవాది ఏపీ సింగ్ వాదనలు వినిపిస్తున్నారు. తన క్లయింట్ కు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవని సుప్రీంకోర్టుకు తెలిపారు. శిక్ష అమలుకు మీడియా, ప్రజలు ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు. కాగా, వాదనలు వినేందుకు నిర్భయ తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకు వచ్చారు.

Supreme Court
nirbhaya
Crime News
New Delhi
  • Loading...

More Telugu News