Actress: జైలు నుంచి విడుదలైన సినీ నటి పాయల్ రోహత్గీ
- నెహ్రూ కుటుంబంపై అనుచిత పోస్టులు
- అరెస్ట్ చేసి జైలుకు పంపిన రాజస్థాన్ పోలీసులు
- రూ.25 వేల పూచీకత్తుపై బెయిలు
భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసి జైలుపాలైన సినీ నటి పాయల్ రోహత్గీ బెయిలుపై విడుదలైంది. నెహ్రూ కుటుంబాన్ని విమర్శిస్తూ పాయల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఇటీవల కలకలం రేపాయి. ఆ పోస్టులపై యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చర్మేష్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న రాజస్థాన్ పోలీసులు ఈ నెల 15న పాయల్‌ను అరెస్ట్ చేశారు. 8 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ అనంతరం రూ.25 వేల పూచీకత్తుపై కోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన పాయల్‌కు అభిమానులు స్వాగతం పలికారు.