shriram lagoo: బాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీరామ్ లాగూ కన్నుమూత

  • గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న శ్రీరామ్
  • హిందీ, మరాఠీ భాషల్లో 211కుపైగా సినిమాలు
  • ఎంఎస్ పూర్తి చేసిన అనంతరం కొంతకాలంపాటు ఈఎన్‌టీ వైద్యుడిగా ప్రాక్టీస్

వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీరామ్ లాగూ (92) కన్నుమూశారు. పూణెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గత రాత్రి తుదిశ్వాస విడిచారు. పూణె మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, ఎంఎస్ పూర్తిచేసిన శ్రీరామ్‌కు నాటకరంగంపై మంచి పట్టుంది. పలు గుజరాతీ, మరాఠీ నాటకాల్లో నటించారు. ఆ తర్వాత చిత్రసీమలోకి ప్రవేశించి హిందీ, మరాఠీ భాషల్లో 211కు పైగా సినిమాల్లో నటించారు.

ఆహత్, పింజ్‌రా, మేరే సాథ్ చల్, సామ్నా, కితాబ్, కినారా వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఎంఎస్ చేసిన అనంతరం కొంతకాలంపాటు ఈఎన్‌టీ సర్జన్‌గానూ శ్రీరామ్ ప్రాక్టీస్ చేశారు. ఆయన భార్య దీపా లాగూ కూడా నటే. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.  

shriram lagoo
kannda actor
  • Loading...

More Telugu News