Andhra Pradesh: రాజధానిలో నాడు భూములు కొనుగోలు చేసిన టీడీపీ నాయకుల వివరాలు ఇవి: మంత్రి బుగ్గన

  • నాడు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు
  • టీడీపీ నాయకులు చాలా మంది భూములు కొనుగోలు చేశారు
  • అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. టీడీపీ నాయకులు ఎవరెన్ని ఎకరాలు కొనుగోలు చేశారన్న వివరాలను ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈరోజు అసెంబ్లీలో ప్రకటించారు.

01.06.2014  నుంచి  01.12.2014 వరకు భూములు కొనుగోలు చేసిన  టీడీపీ నాయకుల వివరాలు ..  

- కంతేరులో హెరిటేజ్ కంపెనీ కోసం 14.22 ఎకరాలు (ఆ భూముల సర్వే నెంబర్లు 27,56, 62,63 )

- మాజీ మంత్రి నారాయణ- తన బంధువులు ఆవుల మునిశంకరరావు, రావూరు సాంబశివరావు, ప్రమీల పేర్లపై 55.27 ఎకరాలు

- ప్రత్తిపాటి పుల్లారావు - గుమ్మడి సురేశ్ పేరుపై 55.27 ఎకరాలు

-  రావెల కిశోర్ బాబు మైత్రి ఇన్ ఫ్రా పేరిట 40.85 ఎకరాలు

- కొమ్మాలపాటి శ్రీధర్ - అభినందన్ ఇన్ ఫ్రా  సంస్థ పేరుపై 68.60 ఎకరాలు

- పయ్యావుల కేశవ్ .. పయ్యావుల శ్రీనివాస్, వేం నరేందర్ రెడ్డి పేర్లపై 15.30 ఎకరాలు

- పల్లె రఘునాథరెడ్డి తన కొడుకు పల్లె వెంకట కిశోర్ కుమార్ రెడ్డి పేరుపై 7.56 ఎకరాలు

- వేమూరు రవికుమార్ ప్రసాద్- 25.68 ఎకరాలు

- లింగమనేని రమేశ్ సుజన, ప్రశాంతి పేర్లపై 351 ఎకరాలు

- యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్ యాదవ్ పేరుపై 7 ఎకరాలు

- కోడెల శివప్రసాద రావు- శశి ఇన్ ఫ్రా పేరుపై 17.13 ఎకరాలు

- ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి- ధూళిపాళ్ల వైష్ణవి, పుల్లయ్య పేర్లపై 13.50 ఎకరాలు

పరిశ్రమల ఏర్పాటు పేరుతో..

వీడీసీ ఫర్టిలైజర్స్ పై.లి. ఎంఎస్ పీ రామారావు, బాలకృష్ణ వియ్యంకుడి బావమరిదికి జగ్గయ్య పేటలో- 499 ఎకరాలు

- కోడెల శివప్రసాదరావు - 17.13 ఎకరాలు

- లింగమనేని రమేశ్  -1.76 + 2.34 ఎకరాలు

- యలమంచిలి శివలింగప్రసాద్ - 4 ఎకరాలు కొనుగోలు చేశారని, వీరే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నట్టు తెలిపారు.

Andhra Pradesh
Amaravathi
Capital
Buggana
  • Loading...

More Telugu News